పోషకాల నిలయం బీపీటీ 2858 ఎర్ర బియ్యం – ఆరోగ్యానికీ, వ్యవసాయానికీ ఆశాజనకమైన రకం

పాలకొండ వెబ్ న్యూస్ News by  BSS Prasad:  అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు తెలిపారు బీపీటీ 2858 అనే ఈ ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు 2023లో రూపకల్పన చేశారు. ఈ పంట కాలం సుమారు 140 రోజులు. ఈ రకం బియ్యం గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది ఎంతో అనుకూలమని చెప్పారు. గత సంవత్సరం విజయనగరం ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డా. కె. లక్ష్మణ్ శాస్త్రవేత్త తేజేశ్వరరావుల ద్వారా ఈ రకాన్ని మినీ కిట్ రూపంలో అందించారని ప్రసాదరావు పేర్కొన్నారు. “నవరా” ఎర్ర వరి వంగడాన్ని దీని తో పోల్చి పరిశీలించినప్పుడు బీపీటీ 2858లో ఉన్న ప్రత్యేక గుణగణాలను గుర్తించామని తెలిపారు.ఈ వరి గింజ తెల్లగా ఉండి, పొర తీసిన తర్వాత ఎరుపు రంగు బియ్యం వస్తుంది. సాంబ మసూరు రకానికి కంటే ఇది సుమారు ఒక అడుగు ఎత్తుగా పెరుగుతుంది, కాండం బలంగా ఉంటుంది. వెన్ను పొడవుగా ఉండడం వల్ల పుష్పోత్పత్తి సమయంలో కవ్వ శాతం పెరగకుండా కొంత పొలినేషన్ సమస్య వస్తుందని తెలిపారు. దీనిపై జోనల్ సమావేశంలో శాస్త్రవేత్తలతో చర్చించగా, వారు పరిశీలనకు తీసుకుంటామని చెప్పారు.“నవరా” రకం 100 రోజుల్లో పంట ఇస్తున్నా, కాండం బలహీనంగా ఉండడం వల్ల గాలి, వర్షం ప్రభావానికి సులభంగా పడిపోతుంది. అయితే బీపీటీ 2858 రకం బలమైన కాండంతో, దీర్ఘకాల పంటకూ అనువుగా ఉండి రైతులకు స్థిరమైన లాభాలను అందించే అవకాశముందని పరిశోధనా నివేదికలు సూచిస్తున్నాయి. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఈ బీపీటీ 2858 ఎర్ర బియ్యం రకం ఆరోగ్య పరిరక్షణకూ, రైతు ఆదాయ వృద్ధికీ కొత్త దారిని చూపనుంది.

Post a Comment

0 Comments