పాలకొండ వెబ్ న్యూస్ :(News by ; BSS Prasad) పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రముఖ కేంద్రంగా ఉన్న పాలకొండ పట్టణం, నియోజకవర్గం, మండల కేంద్రం, సబ్ కలెక్టర్ కార్యాలయానికి ప్రసిద్ధి. ఇంత ప్రతిష్ఠాత్మక హోదా కలిగిన పాలకొండలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రస్తుతం అత్యంత నిర్లక్ష్య స్థితిలో ఉంది. బస్టాండ్ చుట్టూ చెత్తాచెదారాలు పేరుకుపోయి డంపింగ్ యార్డు మాదిరిగా మారింది.కాంప్లెక్స్‌లోని వాతావరణం అసహ్యకరంగా ఉండటమే కాకుండా, టీవీలు పనిచేయడం లేదు. చుట్టుపక్కల పరిసరాలు అస్వచ్ఛంగా మారి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయి. “పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్” అని ఉన్న బోర్డు కూడా చెరిగిపోయి, ఆ ప్రాంతం గుర్తుపట్టలేని పరిస్థితికి చేరింది.పాలకొండ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ బస్టాండ్ పరిస్థితి చూస్తే బాధ కలగక మానదు. కాబట్టి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను శుభ్రపరచి, ఆధునిక సదుపాయాలతో మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ప్రజల తరఫున అధికారుల నుంచి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
0 Comments