మ్యానిఫెస్టో హామీ గాలికి:
ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మాజీ సైనికుల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అందుకు ప్రత్యేక నిధిని కేటాయించి వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని స్పష్టమైన హామీ ఇచ్చారని దుప్పాడ పాపి నాయుడు గుర్తు చేశారు. "కానీ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు హామీని పూర్తిగా విస్మరించింది. ఇప్పటివరకు ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు," అని ఆయన ఆరోపించారు.
సంక్షేమం అందడం లేదు:
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సహాయం అందడం లేదని దుప్పడ పాపి నాయుడు అన్నారు. దేశ సేవలో తమ జీవితాన్ని త్యాగం చేసిన మాజీ సైనికుల పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయం అని ఆయన పేర్కొన్నారు.
"మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధిని ఏర్పరిచి వారి సంక్షేమానికి కృషి చేస్తామన్న కూటమి పార్టీల మ్యానిఫెస్టో హామీని తక్షణమే నిలబెట్టుకోవాలి. కేవలం ఓట్ల కోసం హామీలు ఇవ్వడం కాకుండా, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది," అని దుప్పడ పాపి నాయుడు డిమాండ్ చేశారు.
తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి:
మాజీ సైనికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కూటమి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, వారి సంక్షేమ ము నకు కృషి చేయాలని వైఎస్సార్సీపీ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ విభాగం తరపున ఆయన కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించాలని దుప్పాడ పాపి నాయుడు విజ్ఞప్తి చేశారు. మాజీ సైనికులకు ఉద్యోగాలు రిజర్వేషన్లకు సంబంధించి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో 10% రిజర్వ్ చేయగా ఆంధ్రప్రదేశ్లో కేవలం 2% మాత్రమే కోట ఇస్తున్నారని దీనిని 10% శాతానికి పెంచాలని మాజీ సైనికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. News by: BSS Prasad

0 Comments