పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ నగర పంచాయతీ పరిధి, కెనరా బ్యాంక్ దగ్గరలో "ఇక్కడ చెత్త వేయరాదు, వేసిన వారికి రూ. 500/- జరిమానా విధిస్తాం" అనే హెచ్చరిక బోర్డు ఉంది. అయితే, విచిత్రంగా ఆ బోర్డు కిందనే భారీ చెత్త పోసి ఉంది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం, పరిసరాల్లో ఎక్కడా సరైన డస్ట్ బిన్ సౌకర్యం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. జరిమానా హెచ్చరిక ఉన్నా, తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే చెత్త వేయాల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు. దీనిపై కమిషనర్- పాలకొండ నగర పంచాయతీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. News by: BSS Prasad
0 Comments