రేగిడి దత్తాశ్రమంలో దివ్య జీవన సత్సంగం

రేగిడి, అక్టోబర్ 7 (పాలకొండ వెబ్ న్యూస్) 

రేగిడి దత్తాశ్రమంలో మంగళవారం దివ్య జీవన సత్సంగ సమావేశం భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ కిమిడి సూరపునాయుడు, కిమిడి రవిబాబు ఆధ్వర్యంలో జరిగింది. భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా పాలకొండ సత్యసాయి సేవా సమితి ప్రతినిధి ఎన్‌.వి. రమణ మాట్లాడుతూ, “ప్రకృతిలోని ప్రతి జీవి మనకు పాఠమే. పశువు చేనులో తిని వచ్చిన ఆహారాన్ని తరువాత నెమరు వేసుకుంటుంది. అదే విధంగా మానవుడు కూడా మంచి భావాలను ఎక్కడ కనిపించినా స్వీకరించి, ఆచరణలో పెట్టాలి. సత్సంగాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మశాంతి లభిస్తుంది” అన్నారు.తదుపరి వక్తలుగా  శంకర్రావు, కె. కృష్ణారావు, జడ్డు జగ్గారావు, సామంతుల దామోదరరావు,  కిమిడి సూరపునాయుడు , యు ఉమామహేశ్వరి , జి దామోదర్ రావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక జీవనమే నిజమైన ఆనందానికి మూలమని పేర్కొన్నారు. సద్భావన, సేవా దృక్పథం ద్వారా సమాజం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.కార్యక్రమం ముగిసిన అనంతరం నారాయణ సేవ నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. News by: BSS Prasad

Post a Comment

1 Comments