పాలకొండ వెబ్ న్యూస్: రైతు సమస్యల పరిష్కారానికి అనుబంధాలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (ఏఐకెఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి బంటు దాసు సింగనవలస రైతు సమావేశంలో పిలుపునిచ్చారు. అక్టోబర్ 16న విజయవంతమైన జిల్లా మహాసభలకు కృషి చేసిన వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ, జంపర్కోట రిజర్వాయర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
0 Comments