పాలకొండ వెబ్ న్యూస్ / Palakonda Web News : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం భాసూరు, బెజ్జి గ్రామాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలను కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కణపాక సూర్య ప్రకాష్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నల్లి శివప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు రణస్థలం రాంబాబు, వైఎస్సార్సీపీ రైతు నాయకులు బలగ మన్మథరావు, సర్పంచ్ లు యస్. మల్లేశ్వరమ్మ, శివ్వాల శ్రీనివాసరావు, ఎంపీటీసీలు కోట అజయ్ బాబు, యస్. గురివి నాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. News by : BSS prasad

0 Comments