పాలకొండ వెబ్ న్యూస్: శివభక్తులకు అత్యంత పవిత్రమైన మాస శివరాత్రిని పురస్కరించుకుని, పాలకొండ షిర్డీసాయి ఆలయంలోని అరుదైన మరకత శివలింగానికి సాయంత్రం వేళ ప్రదోషకాల పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా, స్వామివారిని చంద్రప్రభ, సూర్యప్రభ, మకర తోరణాలతో అలంకరించారు. ప్రత్యేకంగా 27 నక్షత్రాలకు గుర్తుగా 27 దీపాలను వెలిగించి, దశవిధ (పది రకాల) హారతులను స్వామివారికి సమర్పించారు. భక్తులు, మరకత శివలింగానికి జరిగిన అభిషేకాలు, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. News By: BSS Prasad
0 Comments