మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభం

పాలకొండ వెబ్ న్యూస్:  పాలకొండ నగర పంచాయతీలోని 4, 5, 7 వార్డులలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ గారు ప్రారంభించారు. స్థానిక పట్టణ అధ్యక్షులు వెలమల మన్మథరావుతో కలసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉద్యోగస్తులు, స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసి, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలవలస ధవళేశ్వర్ రావు, కౌన్సిలర్లు దుప్పాడ పాపినాయుడు, కడగల రమణ, కిల్లారి మోహన్, కోడెం బాబీ, తూముల లక్ష్మణ రావు, పల్లా భాను, నీలాపు శ్రీను స్వామి, దుంపల రమేష్ (చిన్ని), బుక్కూరు దుర్గారావు, పల్లి లక్షుము నాయుడు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. News by : BSS Prasad

Post a Comment

0 Comments