పాలకొండ వెబ్ న్యూస్: భగవాన్ సత్య సాయి బాబా ఆశీస్సులతో సత్య సాయి శివం మందిరం నిత్య నారాయణ సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సేవ కోసం కీర్తిశేషులు స్వర్గీయ శిల్లా సూర్య నారాయణ గుప్త గారి కుటుంబ సభ్యులు — శిల్లా రాజ్ కుమారి, శిల్లా మనోహర్, శిల్ల శ్రీనివాసరావు — లక్ష రూపాయల విరాళం కన్వీనర్ .యు. ప్రభాకర్ రావుకు అందజేశారు.ఈ సేవా కార్యక్రమం ద్వారా “మానవ సేవే మాధవ సేవ” అనే బాబావారి సందేశం ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమం నిర్వహణలో రమేష్ సాహు, కనకం వెంకటరావు, కిల్లారి రవి కీలకంగా వ్యవహరించారు.
నిర్వాహకులు ఇటువంటి నిస్వార్థ సేవలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. News By : BSS prasad
0 Comments