పాలకొండ వెబ్ న్యూస్ తేదీ: 01/10/2025 : పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 19వ వార్డు సచివాలయం పరిధిలోని కస్పావీధిలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ డైరెక్టర్ శ్రీమతి యామల రత్నకుమారి ఇంటింటికీ తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు
చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న
కృషిని గుర్తుచేసి, చంద్రన్న
నాయకత్వాన్ని బలపరచి టీడీపీతో కలసి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని ఆమె
పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా “లబ్ధిదారులకు పెద్ద కొడుకుగా ఉంటాను. మీ
ఆనందంలోనూ కష్టంలోనూ నేను మీతోనే ఉంటాను” అనే మాటను గుర్తుచేస్తూ, అదే విధంగా పెన్షన్లు పంపిణీ
అవుతున్నాయని ఏఎంసీ డైరెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు
పాల్గొన్నారు. News By BSS Prasad

0 Comments