ఎన్వి రమణ ఆధ్యాత్మిక ప్రసంగం

పాలకొండ వెబ్ న్యూస్ 01.10.2025పాలకొండ శ్రీ కోట దుర్గాలయం ప్రాంగణంలో  ఈ రోజు ఆధ్యాత్మిక కర్త, సత్యసాయి భక్తులు ఎన్వి రమణ ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు మానవతా విలువల ప్రాధాన్యం, భక్తి యొక్క సారాంశం, ఉన్నతమైన జీవన విధానంపై వివరించారు.ఆయన మాట్లాడుతూ  ప్రతి వ్యక్తి తన జీవనంలో క్రమశిక్షణ పాటించడం అత్యంత ముఖ్యమని, క్రమశిక్షణ ద్వారా భక్తి బలం పెరుగుతుందని తెలిపారు.అదేవిధంగా, సమాజంలో పరస్పర సహకారం,దయ,సేవామార్గం అనుసరించడం ద్వారా నిజమైన ఆధ్యాత్మికతను ఆచరించవచ్చని భక్తులకు బోధించారు.ప్రసంగంలో పాల్గొన్న భక్తులు ఎన్వి రమణ  ఆధ్యాత్మిక సందేశాలను శ్రద్ధగా ఆలకించి, ఆచరణలో పాటించేందుకు సంకల్పించారు. 

News by BSS Prasad

Post a Comment

0 Comments