​మొంథా తుఫాన్: పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ ఆరా, నాగావళి పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం

పాలకొండ వెబ్ న్యూస్ (కళాభారతి న్యూస్)           
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ మొంథా తుఫాన్ పై ఆరా తీశారు. నాగావళి నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ లు, నాయకులకు ఆదేశాలిచ్చారు. తుఫాన్ నేపథ్యంలో బాధితులకు అండగా నిలవాలని పార్టీ నాయకులను కోరారు. గోపాలపురం సర్పంచ్ సిరిపురం జగదీష్ యువతను అప్రమత్తం చేసి, ప్రజలు నది, విద్యుత్ స్తంభాలు, చెట్ల వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఎటువంటి సంఘటనలు జరిగినా తమకు తెలియజేయాలని ఎమ్మెల్యే కోరారు.
News by : BSS Prasad

Post a Comment

0 Comments