పాలకొండ వెబ్ న్యూస్ (కళాభారతి న్యూస్) పాలకొండ, అక్టోబర్ 27:పాలకొండ నియోజకవర్గాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయడం వలన పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల రైతులు వ్యవసాయ శాస్త్ర పరిజ్ఞానానికి నోచుకోక తీవ్రంగా నష్టపోతున్నారని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు.
గతంలో శ్రీకాకుళంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం (KVK), ఏరువాక కేంద్రం అందుబాటులో ఉండగా, ఇప్పుడు అవి విజయనగరం (రస్తాకుంటుబాయి)కు అనుసంధానం కావడంతో రైతులకు రవాణా భారం, సమయం వృధా అవుతోంది. రెండు బస్సులు మారాల్సి వస్తుండడంతో రైతులు సలహాల కోసం వెళ్లలేకపోతున్నారు. ఫలితంగా, చిరుధాన్యాలు, రబీ-ఖరీఫ్ పంటలు, నానో డీఏపీ వంటి అంశాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి.ఈ ప్రాంత రైతులకు ప్రస్తుతం జిల్లా వ్యవసాయాధికారి (AD), శాస్త్రవేత్తలు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. పాలకొండ డివిజన్ కేంద్రంలోనైనా శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ప్రసాదరావు కోరారు.News by : BSS Prasad
0 Comments