పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ (Palakonda) నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం (Kutami Government) ప్రతిష్టాత్మకంగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొండ శాసనసభ్యులు (MLA) నిమ్మక జయకృష్ణ (Nimmaka Jayakrishna) ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, పాలకొండ మండలం మరియు నగర పంచాయతీ పరిధిలో మొత్తం 22,289 కార్డులను ప్రభుత్వం జారీ చేసి పంపిణీ చేస్తుందని తెలిపారు. చౌక ధరల దుకాణం (Fair Price Shop) ద్వారా రేషన్ సరుకులు పారదర్శకంగా పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. ఆధునిక సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ కార్డుల ద్వారా అవకతవకలకు ఆస్కారం ఉండదని, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాలకొండ నగర పంచాయతీకి చెందిన బిల్లంకి దుర్గా రావు, పప్పల పద్మావతి, చిప్పాడ ఉమాదేవి, మేటికోటి నాగరత్న, కొండదాడి జ్యోతి సహా పలువురు లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులను అందుకున్నారు.
పాలకొండలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: 22,289 మంది లబ్ధిదారులకు కార్డులు
News by : BSS Prasad for loacal News : PALAKONDA WEB NEWS

0 Comments