ఆపదలో ఆదుకుంటున్న సీఎం సహాయనిధి: వీరఘట్టం లబ్ధిదారులకు ఎమ్మెల్యే జయకృష్ణ చెక్కుల అందజేత

పాలకొండ వెబ్ న్యూస్: పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే  నిమ్మక జయకృష్ణ  వీరఘట్టం మండలంకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అనారోగ్య కారణాల వల్ల అత్యవసర వైద్య ఖర్చులు భరించిన వారికి ముఖ్యమంత్రి  సంక్షేమ నిధి నుండి ఈ ఆర్థిక సహాయం అందింది. వీరఘట్టం మండలం,పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే  నిమ్మక జయకృష్ణ వీరఘట్టం మండలంకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను అందజేశారు. అనారోగ్య కారణాల వల్ల అత్యవసర వైద్య ఖర్చులు భరించిన వారికి ముఖ్యమంత్రి  సంక్షేమ నిధి నుండి ఈ ఆర్థిక సహాయం అందింది. వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామానికి చెందిన తాడి అశోక్ కుమార్ కి రూ. 89,928/-, చిటపుడివలస గ్రామానికి చెందిన  మొనంగి కౌశిక్ కి రూ. 42,000/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అందించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజలు, నాయకులు.. కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జయకృష్ణ  ప్రజల పక్షాన ఉండే నాయకులని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ కుటుంబానికి నష్టం వచ్చినా, తమకు అండగా ఉండే నాయకులుగా ఈ ప్రభుత్వం పదిలంగా ఉండాలని వారు కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్ పొందిలాపు కృష్ణ మూర్తి నాయుడు, టీడీపీ నాయకులు ఉదయాన ఉదయ్ భాస్కర్, జామి లక్ష్మి నారాయణ, బళ్లా హరిబాబు, పొన్నాడ నాగేశ్వరావు, జనసేన నాయకులు జనసేన జానీ, మత్స. పుండరికం, చింత ఉమా, సరిపల్లి అచ్యుత్ సహా పలువురు మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. News By: BSS Prasad

      

Post a Comment

0 Comments