పోలీసు అమరవీరుల దినోత్సవం: పాలకొండలో మారథాన్ రన్, మెగా రక్తదాన శిబిరం

palakonjda web news


కళాభారతి న్యూస్ (పాలకొండ వెబ్
news) : News by BSS Prasad.

పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా ఎస్పీ మాధవరావు ఆదేశాల మేరకు పాలకొండలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

పాలకొండ డీఎస్పీ ఎం. రాంబాబు గారి ఆధ్వర్యంలో ముందుగా మారథాన్ రన్ (యూనిటీ రన్) నిర్వహించారు. ఈ రన్‌లో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. పోలీసు అమరుల త్యాగాన్ని స్మరించుకుంటూ, సామాజిక బాధ్యతలో భాగంగా సిబ్బంది రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమాలలో పాలకొండ డీఎస్పీ ఎం. రాంబాబు, పాలకొండ సీఐ ఏ. ప్రసాద్ రావు, పాలకొండ ఎస్ఐ ప్రయోగమూర్తి, వీరఘట్టం ఎస్ఐ కళాధర్, సీతంపేట ఎస్ఐ అమ్మనరావు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షించారు.


డీఎస్పీ ఎం. రాంబాబు
గారి ఆధ్వర్యంలో "పోలీస్ అమరవీరులకు జోహార్" నినాదాలు చేస్తూ పాలకొండ పోలీస్ స్టేషన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ ఏ. ప్రసాద్ రావు, ఎస్ఐ ప్రయోగమూర్తి, పోలీస్ సిబ్బంది, నాయకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.

Post a Comment

0 Comments