'జువా' బ్రాండ్ ఆవిష్కరణ: ఆరోగ్యానికి పెద్దపీట


కళాభారతి న్యూస్ (పాలకొండ వెబ్ news) : News by BSS Prasad.

ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన ‘జువా’ (Juuva) బ్రాండ్‌ను పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారు లాంఛనంగా ప్రారంభించారు.

జువా ముడి పండ్ల కూరగాయల జ్యూస్‌లు, ఓట్ షేక్స్, ఓట్ మీల్స్, మిల్లెట్ మీల్స్, మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను సరసమైన ధరలకు అందించడం ద్వారా సమాజంలో ఆరోగ్యాన్ని పెంపొందించడం ప్రధాన ఉద్దేశం.

ఈ బ్రాండ్ వ్యవస్థాపకుడు విద్యా చరణ్, పాలకొండలో స్థానికంగా SBIలో పనిచేస్తూ, ఈ ఆరోగ్య చొరవను మొదలుపెట్టారు. వారు యోగా కేంద్రాలు, జిమ్‌లు, ఆసుపత్రులు, రక్తదాన శిబిరాలు మరియు క్రీడా సమావేశాలకు ఆర్డర్‌లను అందిస్తున్నారు.

ఆరోగ్యకరమైన జ్యూస్‌లు, మీల్స్ కోసం సంప్రదించాల్సిన నంబర్లు: 6302207258 (కాల్), 9985262536 (వాట్సాప్).

Post a Comment

0 Comments