భజన గాయకుడు బండారు వెంకటరామ దుర్గా ప్రసాదరావుకు జాతీయ నంది పురస్కారం

పాలకొండ మండలం సింగన వలస గ్రామానికి చెందిన భజన గాయకుడిగా, వాయిద్య కళాకారుడిగా 50 ఏళ్ల సేవలకు గుర్తింపుగా బండారు వెంకటరామ దుర్గా ప్రసాదరావు జాతీయ నంది పురస్కారం అందుకున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మరియు తెలుగు వెలుగు సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో ఈ అవార్డును అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 45 మందికి ఈ కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు రాష్ట్ర చైర్మన్ పోలోజు రాజకుమార్, డాక్టర్ దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. ...పాలకొండ వెబ్ న్యూస్

Post a Comment

0 Comments