దిల్లీ: మావోయిస్టు ఉగ్రవాదం నుంచి దేశానికి విముక్తి లభించే రోజు దగ్గరలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం ఎన్డీటీవీ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గత 75 గంటల్లో 303 మంది మావోయిస్టులు లొంగిపోవడం 'నా జీవితంలోనే సంతోషకరమైన విషయం' అని పేర్కొన్నారు. కోటి రూపాయల వరకు బహుమతులు ఉన్న కీలక వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ.. అర్బన్ నక్సల్స్‌ను గతంలో ఆ పార్టీ ప్రోత్సహించిందని మోదీ ఆరోపించారు. లొంగిపోయిన మావోయిస్టులు తుపాకులు, బాంబులు విడిచి భారత రాజ్యాంగాన్ని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధమయ్యారని ప్రధాని తెలిపారు. మావోయిస్టు హింసకు త్వరలోనే ముగింపు పడుతుందని, ఇది 'మోదీ గ్యారంటీ' అని ఆయన ఉద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా భారత్ వృద్ధిని ఎవరూ ఆపలేరని ప్రధాని పేర్కొన్నారు.
CLICK HERE : PALAKONDA WEB NEWS

0 Comments