“ఆటో డ్రైవర్ల సేవ” కార్యక్రమంలో నిమ్మక జయకృష్ణ

పాలకొండ వెబ్ న్యూస్: శ్రీ శక్తి పథకం ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్ల జీవితాన్ని మెరుగు పరచడానికి ప్రారంభించిన “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమంలో పాలకొండ నుండి సీతంపేట వరకు ఆటో ర్యాలీ జరిగింది. ర్యాలీ లో ఆటో తానే నడుపుతూ పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, ఈ పథకం దసరా కానుకగా కూటమి ప్రభుత్వం అందించిందని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైతే గ్రామ సచివాలయాల్లో వివరాలు సరిచూసి అప్లై చేయమని సూచించారు. 

News by: BSS Prasad

Post a Comment

0 Comments