అష్టాదశ శక్తి పీఠాల దేవతామూర్తుల నిమజ్జనం
పాలకొండ వెబ్ న్యూస్:
పాలకొండ, నక్కలపేట (సాయి దుర్గ నగర్):
షిరిడి సాయి మరియు సకల దేవతల ఆలయంలో విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిసాయి. ఆలయ ధర్మకర్త పల్లా కొండలరావు పర్యవేక్షణలో, ప్రధాన అర్చకులు పర్రి శరత్ అష్టాదశ శక్తి పీఠాల దేవతామూర్తులను ప్రతిష్టించి, 11 రోజుల ప్రత్యేక పూజలతో ఉత్సవాలను పూర్తి చేశారు.
ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజాకార్యక్రమాలు చేసి, పట్టణ వీధుల్లో ఊరేగింపు, మరియు నాగావళి నదిలో నిమజ్జన కార్యక్రమం నిర్వాహించబడ్డాయి. News by BSS prasad
0 Comments