కూటమి ప్రభుత్వం వైద్య విద్యను వ్యాపారంగా మార్చింది – పాలకొండలో వైఎస్సార్సీపీ రచ్చబండ


పాలకొండ వెబ్ న్యూస్ News by  BSS Prasad: 
పాలకొండ, అక్టోబర్ 24: కూటమి ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటు పరం చేసి వ్యాపారంగా మార్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపుమేరకు పాలకొండ రామా కళామందిర్ వీధి జంక్షన్‌లో శుక్రవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పాలకొండ పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఐదవ వార్డు కౌన్సిలర్ వెలమల మన్మధరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నగరంలోని ఒకటి, రెండు, పది వార్డుల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్మధరావు మాట్లాడుతూ ప్రైవేటు మెడికల్ కాలేజీల వల్ల పేద విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతాయని, ఉచిత వైద్య సేవలు దెబ్బతింటాయని అన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకు లీజుల పేరుతో లాభాలు కట్టబెడుతోందని తీవ్రంగా విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దుప్పాడ పాపినాయుడు, కిల్లరి మోహన్ రావు, కడగల వెంకటరమణ, కోడెం విజయ్ కుమార్, పల్ల భానుబాబు, తుమ్మగుంట శంకర్రావు, భాసూరు కాంతారావు, నీలాపు శ్రీనివాసరావు, దుంపల రమేష్ బాబు టేకి రామకృష్ణ గెద్ద చిన్నం నాయుడు  తుమ్మగుంట జగదీష్ సుంకరి ధర్మ బొత్స ప్రసాదు కో ఆప్షన్ సభ్యులు బుక్కురు దుర్గారావు వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments