పాలకొండ విద్యార్థినికి ప్రధమ బహుమతి

పాలకొండ వెబ్ న్యూస్ News by  BSS Prasad: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని HUDCO కాలనీ ZPHS పాఠశాలలో నిర్వహించిన వ్యాస, రచన, క్విజ్ పోటీలలో పాలకొండకు చెందిన కుప్పిలి గీతిక భారత రాజ్యాంగ చరిత్ర అంశంపై చక్కని ప్రదర్శనతో ప్రధమ బహుమతి గెలుచుకుంది. విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన అవసరమని, హక్కులు–విధులపై అవగాహన కలిగి దేశ పురోగతిలో భాగస్వాములు కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments