![]() |
పాలకొండ వెబ్ న్యూస్ (కళాభారతి న్యూస్): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాను కారణంగా వరి పంట పూర్తిగా నీట మునిగి, తీవ్రంగా నష్టపోయిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేసింది. వరి కంకులు పూర్తిగా తడిచి ముద్దగా మారిపోయాయని అభ్యుదయ రైతు కండాపు ప్రసాద్ రావు తెలిపారు.
ఈ మేరకు ఆయన పాలకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులకు తడిచి నష్టపోయిన వరి కంకులను చూపించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను, పంట నష్టాన్ని మీడియా ద్వారా తెలియజేశారు.
అనంతరం, కండాపు ప్రసాద్ రావు సబ్ కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ పత్రంలో...
పంట నష్టాన్ని సంబంధిత యంత్రాంగం క్షేత్రస్థాయిలో (పొలాల్లో) స్వయంగా పరిశీలించాలని.
నష్టాన్ని అంచనా వేసి, ఇబ్బందులు పడుతున్న రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటలు తడిచి ఇన్ని రోజులు అవుతున్నా, వాటిని చూడడానికి ఏ ఒక్క అధికారి కూడా రాలేదని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, అన్నదాతల ఆవేదనను తీర్చాలని ఆయన విలేకరులకు విజ్ఞప్తి చేశారు. న్యూస్ బై BSS ప్రసాద్.


0 Comments