నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది
. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా హైలైట్స్ తెలిపారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. -
నేను కాలేజ్ లో ఉన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా కథ రాశాను. అప్పట్లో వచ్చిన ఓ పాట కూడా నన్ను ఈ కథ రాసేందుకు ఇన్స్ పైర్ చేసింది. ఇలా టైమ్ ఉన్నప్పుడు కొన్ని స్క్రిప్ట్స్ చేసుకున్నాను. ఆహా వాళ్లు మాకొక ప్రాజెక్ట్ చేయండి అని అడిగారు. వారికి "ది గర్ల్ ఫ్రెండ్" కథ పంపాను. నేను, రశ్మిక, గీతా ఆర్ట్స్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాల్సిఉండేది. "ది గర్ల్ ఫ్రెండ్" కథను అల్లు అరవింద్ గారు చదివి దీంట్లో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఓటీటీకి వద్దు సినిమానే చేద్దామని అన్నారు. రశ్మిక, మా కాంబోలో ముందు అనుకున్న కథ పక్కనపెట్టి ఈ కథనే సినిమాగా మొదలుపెట్టాం.
- రశ్మిక యానిమల్ సినిమా రిలీజై వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్నప్పుడు నాకు కొంచెం భయమేసింది. రశ్మికను ఇంత రియలిస్టిక్ గా చూపిస్తున్నాం, అక్కడేమో యానిమల్ ఆడియెన్స్ మీద మరో ఇంప్రెషన్ వేస్తోంది అని అనుకున్నా. రశ్మికకు నా సందేహం తెలిసి, ఈ కథకు మీరు నన్ను ఇలాగే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. రియలిస్టిగానే నా క్యారెక్టర్ కనిపించాలి అని సపోర్ట్ చేసింది. మనం వుమెన్ సెంట్రిక్ మూవీస్ అని పిలుస్తుంటాం కానీ ఆ ముద్ర పోయేందుకు ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఈ కథలో హీరో హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూపిస్తున్నాం.

0 Comments