బస్సుల్లో గంజాయి రవాణాకు అడ్డుకట్ట: ఆర్టీసీ సిబ్బందికి ఎక్సైజ్, పోలీస్ అధికారుల సూచనలు



 కళాభారతి న్యూస్, పాలకొండ (వెబ్ న్యూస్):         అక్రమ గంజాయి రవాణాను నియంత్రించే లక్ష్యంతో, పాలకొండలోని ఆర్టీసీ బస్సు డిపోలో ఎక్సైజ్ మరియు పోలీసు అధికారులు గురువారం సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఎక్సైజ్ సీఐ సూర్యకుమారి, పాలకొండ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మూర్తి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు. బస్సుల్లో గంజాయి అక్రమ రవాణా జరగకుండా తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని అధికారుల బృందం ఆదేశించింది. ఎక్కడైనా గంజాయి దొరికినా, అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే తమకు తెలియజేయాలని సిబ్బందికి సూచించారు.

        ఈ సందర్భంగా సీఐ సూర్యకుమారి మాట్లాడుతూ, గంజాయి రవాణా జాతీయ సమస్య అని, దీనిపై ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరు ఎల్. రాము, యూనియన్ నాయకులు బికే మూర్తితో పాటు అధిక సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. News by : BSS Prasad

Post a Comment

0 Comments