పాలకొండ: ముంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పడాల భూదేవి గారు గోపాలపురం, గారమ్మ కాలనీ ముంపు ప్రాంతాలు, వరద ముంచిన వరి పొలాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ద్వారా రైతులకు నష్టం కలగకుండా చూడాలని, పంట నష్టాన్ని త్వరగా అంచనా వేసి నివేదిక పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు భూదేవి తెలిపారు. ఈ పర్యటనలో టీడీపీ నాయకులు గుమ్మడి సింహాద్రి, మజ్జి జయశంకర్, బుడితి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

0 Comments