కళాభారతి న్యూస్, పాలకొండ (వెబ్ న్యూస్):
ముంతా తుఫాను నేపథ్యంలో, పాలకొండ మండలంలోని బాసూరు గ్రామంలో నివాసం ఉంటున్న మట్టి గోడల ఇళ్లు, పూరి గుడిసెల బాధితులను అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సురక్షితమైన పక్కా భవనాలకు తరలించారు. అనంతరం, వారికి అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
అధికారుల
పర్యవేక్షణలో సహాయక చర్యలు
ఈ సహాయక కార్యక్రమాన్ని పాలకొండ
సబ్ కలెక్టర్ మరియు సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అయిన స్వప్నిల్ పవార్ స్వయంగా పర్యవేక్షించారు. వారితో పాటు పాలకొండ మండల
పరిషత్ అధ్యక్షులు శ్రీమతి బొమ్మాలి భాను సుధాకర్ పాల్గొన్నారు. వీరిరువురూ కలిసి బాధితులకు బియ్యం, పప్పులు, నూనె, పంచదార సహా ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
అధికారులు మాట్లాడుతూ, తుఫాను ప్రభావం తగ్గే వరకు బాధితులు సురక్షిత ప్రాంతాల్లోనే
ఉండాలని సూచించారు.
సహాయక చర్యల్లో పాలకొండ తాసిల్దార్ రాధాకృష్ణ , సీఎస్‌డీటీ సన్యాసిరావు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి గురు నాయుడు గారు పాల్గొన్నారు. అలాగే, గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ప్రతినిధి, జనసేన నాయకులు లంక అప్పలనాయుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ ముంజేటి త్రినాథ్ , పెద్ద కోటిపల్లి, ఎల్‌ఎల్ పురం జనసేన నాయకులు సిపాన తిరుపతిరావు, జామి అనిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాధితులకు అండగా నిలిచారు. రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహా తదితరులు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. అధికారుల సమన్వయంతో బాసూరు గ్రామస్తులకు ముందస్తు భద్రత కల్పించినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. News by : BSS Prasad

0 Comments