(పోటీ పరీక్షల కోసం ప్రత్యేక కథనం)
జీవితంలో చాలా సందర్భాల్లో మనం సాధ్యమే అయిన పనిని అసాధ్యం అని భావించి వెనుకడుగు వేస్తాము. అలాంటి తప్పు నమ్మకాల బంధనాల గురించి చెబుతుంది ఈ “ఏనుగు తాడు” అనే ప్రసిద్ధ ప్రేరణాత్మక కథ.
ఒక వ్యక్తి ఏనుగుల గుంపు పక్కన నడుస్తూ, పెద్దవైన ఆ ఏనుగులను కేవలం ఒక చిన్న తాడుతో కట్టి ఉంచడం చూసి ఆశ్చర్యపోయాడు. తాళాలు లేవు, బోనులు లేవు — అయినా అవి అక్కడికక్కడే నిలబడి ఉన్నాయి.
ఆశ్చర్యంతో అతను శిక్షకుడిని అడిగాడు, “ఇంత పెద్ద ఏనుగులు ఆ తాడు తెంచి వెళ్లిపోవడం ఎందుకు చేయవు?” అని.
శిక్షకుడు సమాధానమిచ్చాడు — “ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఇదే తాడు వాటిని బలంగా కట్టేది. ఆ వయస్సులో అవి ప్రయత్నించినా విడిపోలేవు. క్రమంగా పెరుగుతూ తాము ఆ తాడును తెంచలేమని నమ్మకం కలిగింది. ఇప్పుడు అవి పెద్దవైనా, ఆ నమ్మకం వల్ల ప్రయత్నించవు.”
ఈ సంఘటన మనకు గొప్ప సందేశాన్ని అందిస్తుంది — మన పరిమితులను నిర్ణయించేది మన శరీరం కాదు, మన మనసు. మనసులోని భయాలు, తప్పుడు నమ్మకాలు మన ముందుకు సాగడాన్ని అడ్డుకుంటాయి.
👉 పాఠం:
తప్పు నమ్మకాలను చెరిపేస్తే, మనలోని శక్తిని వెలికి తీయగలం. మన విజయానికి ప్రధాన అడ్డంకి మన స్వంత భయం మాత్రమే.
..... బాసూరు శివశంకర ప్రసాద్
0 Comments