పాలకొండ వెబ్ న్యూస్ (కళాభారతి న్యూస్)
🗞️ మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాద్ కోరారు. రానున్న రెండు రోజులు (మంగళ, బుధవారాల్లో) భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కొండ ప్రాంతాలైన కురుపాం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురంపై తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. మట్టి ఇళ్లలో నివసించేవారు తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. తుఫాను సంబంధిత సమస్యల కోసం పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
0 Comments