పాలకొండ వెబ్ న్యూస్ :పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సంఘ కార్యవర్గంలోకి పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం, లుంబూరు గ్రామానికి చెందిన సోదరులు కిమిడి సూర్యకుమార్, కిమిడి చంద్రకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంఘ ఎన్నికలు ఈ నెల 19న జరిగాయి. విశాఖపట్నంలోని నాలుగో ఏసీఎం కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా పనిచేస్తున్న కిమిడి సూర్యకుమార్ రాష్ట్ర సహకార్యదర్శిగా నియమితులయ్యారు. అదే విధంగా, పార్వతీపురం కోర్ట్స్‌లో ఏపీపీగా ఉన్న కిమిడి చంద్రకుమార్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరుగా నియమితులయ్యారు.
తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గాను ఈ సోదరులు, సూర్యకుమార్, చంద్రకుమార్‌లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సోదరులు ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.News by : BSS Prasad
0 Comments