పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వడమ రోడ్డులో రవాణా సమస్యలు తీవ్రంగా పెరిగాయి. కావ్య ప్రింటర్స్ వద్ద రహదారి పూర్తిగా పాడైపోయి, పెద్ద గుంతల్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గం ద్వారా అంపిలి సహా పరిసర గ్రామాల నుండి వచ్చే వాహనదారులు, ప్రజలు రోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా రోడ్డు మరింతగా ధ్వంసమై ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత కోసం వడమ రోడ్డును తక్షణమే మరమ్మతు చేయాలని వారు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
0 Comments