పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో గత ప్రభుత్వ సమయంలో జరిగిన భూ ఆక్రమణలపై కట్టుదిట్టం చర్యలు తీసుకోనున్నట్లు పాలకొండ తహసిల్దార్ చల్లా రాధాకృష్ణ మూర్తి తెలిపారు.గతంలో బెజ్జి గ్రామంలో భూ ఆక్రమణలపై కూటమి నాయకులు అనేక సార్లు పోరాటాలు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో, పాలకొండ నియోజకవర్గ జనసేన శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ భూ ఆక్రమణ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.తద్వారా, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సూచనల ప్రకారం పాలకొండ రెవెన్యూ అధికారులు శుక్రవారం బృందంతో బెజ్జి గ్రామానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. తహసిల్దార్ రాధాకృష్ణ గ్రామస్తులతో మాట్లాడుతూ, భూ ఆక్రమణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థల పరిశీలనలో తహసిల్దార్‌తో పాటు నీటి సంఘం వైస్ చైర్మన్ వావిలపల్లి సత్యం నాయుడు, మండల జనసేన నాయకులు మిడితాన ప్రసాదరావు, రెవెన్యూ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. భూ ఆక్రమణలపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించబడినట్లు అధికారులు తెలిపారు.
0 Comments