జాతీయ సదస్సులో రాపర్తి ప్రసాద్ పరిశోధన పత్రం .. ప్రదర్శనభాషా బోధనలో జీవన నైపుణ్యాల ప్రాధాన్యం

పాలకొండ వెబ్ న్యూస్: 

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ జి.వి.ఆర్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, శ్రీ వై.యన్. బీ.ఎడ్. కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సదస్సు జరిగింది. “తెలుగు సాహిత్యం–భాషా బోధన–మనోవికాసం” అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పలువురు విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, వ్యక్తిత్వ వికాస శిక్షకుడు రాపర్తి ప్రసాద్మాధ్యమిక విద్య–భాషా బోధన–జీవన నైపుణ్యాలు” అనే అంశంపై పరిశోధనా వ్యాసాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన 6–10వ తరగతి తెలుగు వెలుగు పాఠ్యపుస్తకాల ఆధారంగా భాషా బోధనలో జీవన నైపుణ్యాల ఆవిష్కరణ, ఉపాధ్యాయ–విద్యార్థుల చర్చా విధానాల ప్రాముఖ్యతను విశ్లేషించారు.

ఈవ్యాసం సదస్సు ప్రత్యేక సంచికలో ప్రచురించ బడింది. ఈ సందర్భంగా రాపర్తి ప్రసాద్‌ను మహాసహస్రావధాని కడిమేల వరప్రసాద్, సినీ గీతరచయిత అనంత్ శ్రీరామ్ తండ్రి సీ.హెచ్. సత్యనారాయణమూర్తి గౌరవ సన్మానం చేశారు.

రాపర్తి ప్రసాద్ మాట్లాడుతూ – “భాషా బోధన పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదు. విద్యార్థులలో సంభాషణ, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, సామూహిక చైతన్యం వంటి జీవన నైపుణ్యాల పెంపే అసలు లక్ష్యం,” అని పేర్కొన్నారు.News by: BSS Prasad


Post a Comment

3 Comments

  1. That essay title sounds very interesting,how can public access this essay?

    ReplyDelete
  2. అభినందనలు ప్రసాద్ గారూ💐💐💐

    ReplyDelete
  3. నేను ఈ సదస్సులో ఉన్నాను. మంచి సదస్సు. జై తెలుగు తల్లి🙏🙏

    ReplyDelete