పాలకొండ వెబ్ న్యూస్, అక్టోబర్ 8 : పాలకొండ శ్రీ శ్రీ శ్రీ కోటదుర్గమ్మ దేవస్థానంలో ఇటీవల జరిగిన దసరా ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా ముగిశాయి. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 5 వరకు కొనసాగిన ఉత్సవాల్లో ప్రతిరోజూ భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఉత్సవాల విజయవంత నిర్వహణలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, పల్ల కొండబాబు, గంటా సంతోష్, మరియు ఇతర పెద్దలందరి చొరవతో, దేవాలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వివి సూర్యనారాయణ విశేష పాత్ర వహించారు. ఈ సందర్భంగా పూర్వపు సేవకులు, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ సెక్రటరీ భాసూరు కృష్ణమూర్తి వీరిరువురినీ శాలువాతో సత్కరించారు. దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని భాసూరి కృష్ణమూర్తి కోరారు. 1964 నుండి కొనసాగుతున్న ఆలయ ఆనవాయితీలను సంపూర్ణంగా పాటించా లన్నారు.ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసిన డిఎస్పీ ఎం. రాంబాబు, సీఐ ఏ. ప్రసాద్, ఎస్ఐ కే. ప్రయోగమూర్తి తదితర పోలీసు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల ప్రచారంలో సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, దాతలు, భవాని భక్తులు, అలాగే దేవస్థాన సిబ్బందికి భాసూరు కృష్ణమూర్తి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
News By :BSS Prasad
0 Comments