సూర్యఘర్ పథకం రాయితీలు వాడుకోండి...జీఎస్టీ తగ్గింపుతో సౌర వ్యవస్థ మరింత చౌక

పాలకొండ, వెబ్ న్యూస్ అక్టోబర్ 18:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను పాలకొండ ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ  ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పాలకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో 'సూపర్ జీఎస్టీ సూపర్ గిఫ్ట్' కార్యక్రమంలో భాగంగా సూర్య ఘర్ సోలార్ సిస్టం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల పరిషత్ అధ్యక్ష ప్రతినిధి బొమ్మాలి సుధాకర్ రావు, ఎంపీడీఓ ఎం.వి. రంగారావు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద సోలార్ సిస్టమ్‌పై భారీ సబ్సిడీ అందుబాటులో ఉందని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సోలార్ పరికరాలపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో సోలార్ సిస్టమ్ ధర మరింత తగ్గిందని, వినియోగదారులు ఈ డబుల్ రాయితీలను తప్పకుండా ఉపయోగించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ రాయితీలు, జీఎస్టీ తగ్గింపులపై పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు స్పష్టం చేశారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఏఈ, డీఈ, ఏడీ, ఈఈ సహా ఇతర విద్యుత్ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. news by: BSS Prasad

Post a Comment

0 Comments