పాలకొండలో వృథా అవుతున్న విద్యుత్ — తెల్లవారినా ఆరని వీధి దీపాలు


పాలకొండ వెబ్ న్యూస్, అక్టోబర్ 19: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో  వీధి లైట్లు తెల్లవారినా కూడా ఆరిపోకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల వివరాల ప్రకారం, పట్టణంలోని పలు ప్రాంతాల్లో  తెల్లారిన తరువాత కూడా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. దీనివల్ల విలువైన విద్యుత్ వృథా అవుతుండగా, ప్రభుత్వం ప్రకటించిన ‘విద్యుత్ ఆదా – దేశాభివృద్ధి’ లక్ష్యం కేవలం నినాదంగానే మిగిలిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సాంకేతిక లోపమా? లేక నిర్వాహకుల నిర్లక్ష్యమా? అన్నది ఇప్పటికీ తెలియరాలేదు. అయితే, విద్యుత్ వృథాను అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఆటోమేటిక్ టైమర్ వ్యవస్థను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పట్టణ ప్రజల మాటల్లో — “రాత్రికి చీకటి వెలిగించాలంటే లైట్లు అవసరం, కానీ ఉదయం వెలుగులో అవి వెలిగితే మన కష్టంతో సంపాదించిన విద్యుత్, డబ్బు రెండూ వృథా అవుతాయి” అని తెలిపారు.అధికారుల స్పందన అవసరం!పాలకొండ పట్టణంలో విద్యుత్ వృథాపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి సరైన పర్యవేక్షణా చర్యలు చేపట్టాలని కోరడమైనది.

Post a Comment

0 Comments