పాలకొండ వెబ్ న్యూస్ :
పాలకొండ ప్రజల ఇలవేల్పు కళింగాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గమ్మ తల్లి వారి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమి సందర్భంగా గురువారం ముగింపు రోజు తుఫాను కారణంగా ఆదివారం 5వతేదీకి వాయిదా పడింది. అమ్మవారి తిరువీధి రాత్రి జరిగే తిరువీధి ఉత్సవానికి డి.ఎస్.పి ఎం రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించ నున్నారు డ్రోన్ కెమెరాల ద్వారా క్షణక్షణం ఉత్సవ తిరువీధిని పర్యవేక్షించ నున్నారు ఈ తిరువీధి ఉత్సవంలో సాంప్రదాయ బద్ధంగా బల్ల వేషాలు పులి వేషధారణలు గిరిజన నృత్యాలు సాము గరిడీలు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల నడుమ అమ్మవార్ కలిశాన్ని పట్టణ పురవీధులలో ఊరేగించనున్నారు, అలాగే పంచలోహాలతో తయారు చేసినటువంటి అమ్మవారి ఉత్సవ మూర్తిని పట్టణంలో అన్ని వీధులలో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అమ్మవారిని వేడుకను చూసేందుకు పట్టణ వాసులతోపాటు చుట్టూ ప్రక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు.
News by: BSS Prasad.
0 Comments