చరిత్ర వాహినిలో ఉత్తరాంధ్ర కాపులు ...పుస్తక ఆవిష్కరణ

పాలకొండ వెబ్ న్యూస్:
చిల్లగట్లు శ్రీకాంత్ కుమార్ రచించిన “చరిత్ర వాహినిలో ఉత్తరాంధ్ర కాపులు” పుస్తక ఆవిష్కరణ శనివారం పాలకొండలో ఘనంగా జరిగింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కాపుల సంఘ అధ్యక్షుడు కణపాక చౌదరినాయుడు అధ్యక్షతవహించారు.కార్యక్రమంలో మాట్లాడిన రైతు గోపి పుస్తకంలోని ప్రధాన అంశాలను వివరించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాపుల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించేలా రచయిత శ్రీకాంత్ కుమార్ ఈ గ్రంథాన్ని సమగ్రంగా రూపొందించినట్టు పేర్కొన్నారు.కార్యక్రమంలో తుమ్మగుంట శంకరరావు, కడగల రమణ, కొరికాన గంగునాయుడు,  ఆర్. రామకృష్ణ తదితరులు పాల్గొని రచయితకు శుభాకాంక్షలు తెలిపారు. చివరగా రచయిత తన అనుభవాలను పంచుకున్నారు.




Post a Comment

0 Comments