పాలకొండ వెబ్ న్యూస్ (పార్వతీపురం మన్యం జిల్లా):
రాష్ట్రంలో నకిలీ మద్యం అరికట్టాలని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వడమ జంక్షన్ నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి, ఎక్సైజ్ సీఐ సూర్యకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
News by: BSS Prasad
0 Comments