పాలకొండ వెబ్ న్యూస్..పార్వతిపురం మన్యం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పాలకొండకు చెందిన కనపాక చౌదరి నాయుడు నియమితులయ్యారు. విజయవాడలో ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చంద్రమోహన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నియామకం జరిగింది.
అఖిల భారత తూర్పుకాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం, తూర్పుకాపు జాయింట్ యాక్షన్ కమిటీ సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి. తూర్పు కాపు జాతి ఉద్ధరణకు నిబద్ధత అవసరమని చంద్రమోహన్ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర మినహా ఇతర జిల్లాలలో ఓబిసి (OBC) సాధన, జాతి సంక్షేమ నిధి ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. మహిళా భాగస్వామ్యంపై హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. News By: BSS Prasad
0 Comments