సీఎం సహాయనిధి పేదలకు అభయహస్తం : ఎమ్మెల్యే నిమ్మక

పాలకొండ వెబ్ న్యూస్ — వీరఘట్టం మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ అందజేశారు.సంత నర్సీపురం గ్రామానికి చెందిన కర్రి శ్రీరాముల నాయుడుకు ₹44,182 చెక్కు, చిట్టపుడివలస గ్రామానికి చెందిన బుడ్డి జగన్నాధరావుకు ₹50,000 చెక్కు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మక మాట్లాడుతూ — “గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ వ్యవస్థ నిర్వీర్యమైంది. కానీ కూటమి ప్రభుత్వం సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, వైద్య సహాయం అందజేస్తూ పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది” అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

.              News by: BSS Prasad



Post a Comment

0 Comments