మంగళాపురంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

పాలకొండ వెబ్ న్యూస్:  తేదీ: 09-10-2025 : చిన్నమంగళాపురం గ్రామంలో శ్రీ విజయ మల్టీస్పెషల్టి హాస్పిటల్, సంజీవ రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు, పాలకొండ నియోజకవర్గ సీనియర్ నాయకులు గర్భాన సత్తిబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “ఇటీవలి భారీ వర్షాల కారణంగా వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు సహాయం అందించడానికి ఈ శిబిరం ఏర్పాటు చేశాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కిమిడి కాశినాయుడు, జనసేన నాయకులు గౌరనాయుడు, డాక్టర్ సాయి శంకర్ (ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్), మార్కెటింగ్ మేనేజర్ బి. రవి, శ్రీకాంత్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. News by BSS Prasad

Post a Comment

0 Comments