గ్రామీణ తెలుగు తేజం – అమెరికాలో ప్రకాశిస్తున్న ముంజేటి సాయి కీర్తన

పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ పట్టణానికి చెందిన ముంజేటి సాయి కీర్తన అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మోర్గాన్ స్టాన్లీలో ఉద్యోగం సంపాదించడం ద్వారా తన ప్రతిభను చాటుకుంది. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయి కంపెనీ వరకు చేసిన ఈ ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.

సాయి కీర్తన ఏడాదికి భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు ₹92 లక్షల వేతనం పొందనుంది. వైజాగ్‌లోని గాయత్రి విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కళాశాలలో B.Tech పూర్తి చేసిన ఆమెకు చిన్ననాటి నుంచే అమెరికాలో ఉన్నత విద్యా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు తల్లి, తండ్రుల ప్రోత్సాహంతో పాటు విద్యా రుణం ద్వారా రెండు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లి North Carolina University – Charlotteలో MS పూర్తి చేసింది.

సాయి కీర్తన తండ్రి ముంజేటి ఈశ్వర్‌రావు నర్సిపురం గోర పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా, తల్లి డాక్టర్ సత్యప్రభ  పాలకొండ జూనియర్ కాలేజీలో  వైస్ ప్రిన్సిపాల్ గా సేవలందిస్తున్నారు. వీరి కుటుంబం పాలకొండ నీలమ్మ కాలనీలో స్థిర నివాసం ఉండగా, స్వగ్రామం వీరఘట్టం మండలం రేగులపాడు.

సాయి కీర్తన విజయవార్త తెలిసిన వెంటనే రేగులపాడు, పాలకొండ ప్రాంతాల్లో ఆనందం వెల్లివిరిసింది. బంధువులు, స్నేహితులు, సహచరులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
   
         గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఒక తెలుగు యువతి ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలో స్థానం సంపాదించడం గర్వకారణం. ఇది యువతకు ఒక స్పష్టమైన సందేశం — సంకల్పం, కృషి, పట్టుదల ఉంటే ఏ కల అయినా నిజమవుతుంది. 🌹💐 News by : BSS Prasad


Post a Comment

0 Comments