పాలకొండ వెబ్ న్యూస్: వ్యవసాయ రంగంలో మరో శుభవార్త . బాపట్ల వరి పరిశోధనా కేంద్రం రూపొందించిన ఎంటీయూ 3082 వరి రకం రైతులకు నిజమైన వరంగా మారింది. ఇది ఎంటీయూ 1075 మరియు ఆర్‌ఎన్‌ఆర్ 15048 (తెలంగాణ సోన) సంకరజాతి. ఈ రకం రబీ సీజన్‌లో కేవలం 120 రోజుల్లో కోతకు సిద్ధం అవుతుంది. సాంబమసూరి కంటే గింజ సన్నగా, వెన్నుగా ఉండి ఎకరాకు 30–45 బస్తాల దిగుబడి ఇస్తుంది. ముఖ్యంగా ఈ రకం తెగుళ్లు, కీటకాలకు గురికాదు, అందువల్ల ఖర్చు తక్కువ.
మధుమేహ బాధితులకు తినడానికి కూడా ఇది అనుకూలం. చేను కాండం దృఢంగా ఉండడం వలన గాలికి పంట కూలిపోదు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా మార్టీరు పరిశోధనా స్థానం ఈ రకాన్ని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావుకు పరిశీలనార్థం అందజేసింది. ఈ కొత్త రకం విస్తరించితే, రైతులకు అధిక లాభాలతో పాటు ఆరోగ్యకరమైన బియ్యాన్ని అందించే అవకాశం ఉంది. News by: BSS Prasad
0 Comments