సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడిని ఖండించిన సిపిఐ

 పాలకొండ, వెబ్ న్యూస్ అక్టోబర్ 8: సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్‌పై జరిగిన   దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఖండించింది. పార్టీ మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు నేతృత్వంలో పాలకొండ యాలం సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రజాస్వామ్యానికి అవమానమని తెలిపారు. కార్యక్రమంలో ద్వారపూడి అప్పలనాయుడు, గోపి నాయుడు, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments