పాలకొండ వెబ్ న్యూస్ & కళాభారతి న్యూస్ : మన్యం జిల్లాలోని పాలకొండ ప్రాంతాన్ని మొంతా తుఫాను అతలాకుతలం చేసింది. చేతికి అందాల్సిన వరిపంట కళ్లముందే నీట మునగడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పాలకొండ మండల కేంద్రంలో సుమారు 150 ఎకరాల వరిపంట మునిగిపోయింది. అప్పులు చేసి పంట వేసిన రైతులు, ధాన్యం చేతికి వచ్చే సమయానికి తుఫాను వల్ల పూర్తిగా తడిచి, మొలకలు వచ్చేయడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
> "ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే అప్పులు తీర్చలేక ఇబ్బందుల పాలు అవుతాం" అని రైతులు విలపిస్తున్నారు.
>
నష్టపోయిన పంటను సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు రైతులతో కలిసి పరిశీలించారు. తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రౌండ్ లెవెల్‌లో పంటనష్టం అంచనా వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గుమ్మడి గోవిందరావు, సుంకరి ధర్మ, దుప్పాడ సూర్యనారాయణ, సుంకర చిన్నోడు, ముల్లు శంకర్రావు తదితర రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
0 Comments