కళాభారతి న్యూస్ & పాలకొండ వెబ్ న్యూస్
NEWS BY: BSS PRASAD : అక్టోబర్ 29, 2025 జిల్లాల పునర్విభజనలో పాలకొండకు న్యాయం చేయాలని కోరుతూ పాలకొండ జిల్లా సాధన సమితి ప్రతినిధి వర్గం ఈరోజు సాలూరులో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారిని కలసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది. పాలన సౌలభ్యం కోసం జరుపుతున్న జిల్లాల పునర్విభజన నేపథ్యంలో, పాలకొండ పాత రెవెన్యూ డివిజన్‌ను ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని లేదా కనీసం శ్రీకాకుళం మంత్రి ఆవిష్కరించారు జిల్లాలోనైనా కలపాలని సాధన సమితి నాయకులు మంత్రిని కోరారు.గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా జరిగిన జిల్లా విభజన సందర్భంగా పాలకొండ పాత రెవెన్యూ డివిజన్‌ను మూడు ముక్కలు చేశారని వారు విమర్శించారు. ఈ విభజనపై 2020 నుంచి రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నామని సమితి తెలియజేసింది.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల సామాజిక బాంధవ్యాలు, భౌగోళిక పరిస్థితులు, పాలన సౌలభ్యం దృష్టిలో పెట్టుకుని విభజన చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో, పాలకొండ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. విజ్ఞాపన పత్రం ఇచ్చిన వారిలో సాధన సమితి గౌరవ అధ్యక్షుడు కనపాక చౌదరి నాయుడు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, కోశాధికారి సబ్బ నానాజీ, పాలకొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వల్లూరు సత్యనారాయణ, రుంకు రామకృష్ణ, విశ్రాంత సైనికు ఉద్యోగాల సంఘం ఉపాధ్యక్షులు వెన్నపు వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కనపాక చౌదరి నాయుడు రచించిన విశ్వతేజ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.
0 Comments