పాలకొండ వెబ్ న్యూస్:
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో పాలవలస విక్రాంత్
పార్వతీపురం మన్యం జిల్లా, భామిని మండలం:
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు (MLC) పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు. భామిని మండలం కీసరి, కోసలి గ్రామాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి సంతకాలను సేకరించారు.
ఈ సందర్భంగా వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకట రమణ నాయుడు, భామిని మండల వైస్ ఎంపీపీ బోనిగెడ్డ ధర్మారావు, కన్వీనర్ బోదెల శ్రీనివాసరావు, కీసరి సర్పంచ్ వలురోతు పద్మమ్మ, కోసలి సర్పంచ్ మజ్జి మోహన్ రావు, ఎంపీటీసీ కొత్తకోట చంద్రశేఖరరావు, మేడి చలపతిరావు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వలురోతు రామకృష్ణ, కొత్తకోట ఆంజనేయులు, కిల్లారి మోహనరావు, మాజీ ఎంపీటీసీ వలురోతు మిన్నారావు, ఎరుకుమజ్జి వైకుంఠరావు, వలురోతు వెంకటరమణ, రామప్రసాద్ పాత్రో, ఎరుకుమజ్జి పాపినాయుడు, గెల్లంకి రమేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. News by : BSS Prasad
0 Comments